Nara Chandrababu Naidu Instagram – తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో… ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు.
మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోను దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
#YSRCPRowdyism | Posted on 14/May/2024 17:37:42



