Gayatri Bhargavi

Gayatri Bhargavi Instagram – Let NOT IGNORANCE make you LOSE your MONEY and PEACE OF MIND.
Awareness 🚨

బ్యాంకు ఖాతాల్ని కొల్లగొట్టి
‘మేం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ బ్యాంకు ఖాతా నుంచి అక్రమ లావాదే వీలు పెద్ద ఎత్తున జరిగాయి. మీ పై మనీలాండరింగ్ కేసు నమోదైంది’ అంటూ ఫోన్ చేసి బెదిరిస్తారు. ఈ కేసులో మీ ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవటానికి మీ బ్యాంకు ఖాతాను పరిశీలించాలంటూ వీడియోకాల్ చేస్తారు. మీ యూజర్నేమ్, పాస్వర్డ్ సహా వివరాలన్నీ తెలుసుకుని.. ఆ ఖాతాల్లోని నగదు మాయం చేస్తారు. ఫెడెక్స్ కొరియర్ సర్వీసెస్ పేరుతో ఫోన్ కాల్స్ చేస్తూ ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. విశాఖ పట్నం పరిధిలో ఎక్కువ మంది ఇలాంటి నేరాలకు బాధితులుగా మారారు.

మీ వ్యక్తిగత వివరాలు చెప్పినంత మాత్రాన నిజమేనని నమ్మొద్దు
* ఇలాంటి మోసాల్లో మిమ్మల్ని నమ్మించేం దుకు మీ వ్యక్తిగత వివరాలన్నీ చెబుతారు. అవన్నీ నిజమేనని భావించొద్దు.
* కస్టమ్స్, సీబీఐ, ఈడీ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఇలాంటి సంస్థల నుంచి మాట్లాడుతు న్నామని ఎవరైనా చెబితే కచ్చితంగా అనుమా నించాల్సిందే.
* దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్లో విచారించదు. మీ పేరిట వచ్చిన పార్శిళ్లు, కొరియర్లలో మాదకద్రవ్యాలు ఉన్నా యని బెదిరించినా భయపడొద్దు.
* ఆ ఫోన్ నంబర్ సహా వివరాలన్నీ నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి
* ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పొద్దు. డబ్బులు బదిలీ చేయొద్దు.
మీ సైబర్ క్రైమ్ బాధితుడు అయితే call Cyber Crime Helpline number 1930, 8712665171 or by visiting cybercrime.gov.in.

#cybercrime #cybersecurity #awarness #whatsapp #telegram #socialmedia #crime #alert #save #money #fraud | Posted on 20/Aug/2024 22:54:42

Gayatri Bhargavi
Gayatri Bhargavi

Check out the latest gallery of Gayatri Bhargavi