Shobha Shetty Instagram – Navarathri look day 9 🩷🩷🩷
.
.
అవతారం : సిద్ధిదాత్రీ దుర్గా
సిద్ధిదాత్రీ దుర్గా, ‘నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.
ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. ఈమెను స్తోత్రాలు, మంత్రాలు, కవచాల ద్వారా ఆరాధిస్తారు. | Posted on 30/Sep/2025 18:16:28



