Shyamala

Shyamala Instagram – ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ము, సత్తా ఉంటే చెప్పండి.

1. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా?

2. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా?

3. మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేలలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా?

4. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు?

5. రాత్రి 7 గంటలకు, 8.45 గంటలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగాడని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందని అర్ధం కావడం లేదా?

6. ఆ రెండుసార్లు షాపులో లిక్కర్ కొన్న తర్వాత మళ్లీ.. మరోచోట లిక్కర్ కొన్నాడని, ఆ మత్తువల్లే అతను ప్రమాదానికి గురవడం, దీని వల్లే బస్సు ప్రమాదం జరగడం వాస్తవం కాదా?

7. లక్ష్మీపురంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటికి సీసీ కెమెరా కూడా పెట్టాడు. మరెందుకు ఆ ఫుటేజీ బయటపెట్టడం లేదు? ఆ బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎందుకు విచారించడం లేదు? కారణం.. మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలని బయటపడతాయనే కదా?

8. లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 బెల్టుషాపులు అన్నది నిజమే కదా?

9. రాష్ట్రంలో ములకలచెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావుడిగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన వీడియోలో క్యూఆర్ కోడ్ చెకింగ్ చేసినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. అంటే మీరు ఊరికే ఆర్డర్లు ఇస్తారు. అవి అమలవుతున్నట్టు మీ మీడియాలో రాస్తారు. అమలవుతున్నట్టుగా ప్రజలు భావించాలి.

10. లిక్కర్ షాపులు నిర్వహించేదీ టీడీపీ వాళ్లే. బెల్టు షాపులు పెట్టి, అమ్మేది టీడీపీవాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు

#StopNBrandsSaveLives
#NaraLiquorBabu
#IdhiMunchePrabhutvam | Posted on 28/Oct/2025 17:51:57

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4